BIG BREAKING: పోసానికి బెయిల్
కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. దీన్ని ఇంతవరకు అమలు చేయలేదు. ప్రస్తుతం ఉచిత బస్ జర్నీని జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. వచ్చే క్యాబినెట్ నాటికి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీ అనంతపురం తిలక్‌నగర్‌కు చెందిన భారతి పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రామాంజనేయులే ఆమెను ఉరేసుకుని చనిపోవాలని బెదిరించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి, అతని పెద్ద అల్లుడు మారుతిని కూడా అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఫ్రీబస్ ప్రయాణంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్సు ప్రయాణం రాష్ట్రమంతా కాదని, జిల్లాల వరకే పరిమితమని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.
తీవ్ర జ్వరంతో అసెంబ్లీకి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే సభకు వస్తే సభ నుండి సస్పెండ్ చేసి పంపిస్తాం అంటూ నవ్వుతూ చెప్పారు. రెస్ట్ తీసుకోకోకుంటే.. యాపిల్ వాచ్ కొనిచ్చి మీ హెల్త్ ను మానిటర్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పాటు బీటెక్ చదివిని యువతిని శిష్యురాలిగా వెంటపెట్టుకున్నారు. ఇకనుంచి ఆ యువతిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపారు. ఆమెకు కఠోర శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. ఆ యువతి కూడా తన ఫ్యామిలీకి చెప్పే వచ్చానని వెల్లడించింది.