Elephants: మన్యంలో ఏనుగుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి...

ఉమ్మడి విజయనగరం..పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. పంటలు నష్టం చేస్తున్నాయి. కురుపాం మండలంలోని జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లిలలో గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

New Update
 Elephants Hulchul In Parvathipuram

Elephants Hulchul In Parvathipuram

Elephants :  ఉమ్మడి విజయనగరం..పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి..కురుపాం మండలంలోని గిరిశిఖర , జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి లలో గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గరుగుబిల్లి మండలంలోని ఒక ఏనుగుల గుంపు మిల్లులో చొరబడి బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే కురుపాం మండలం పట్టాయిగూడ గిరిజన గ్రామంలోనికి ఏనుగులు చొరబడటంతో గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఏ క్షణం తమపై ఏనుగులు దాడి చేస్తాయో అని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.

Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్

పార్వతిపురం జిల్లా కొమరాడ మండలం లో గత 15 రోజులు గా మాకం వేసిన ఏనుగులు.. స్థానికంగా ఉన్న కొబ్బరి, పామ్ ఆయిల్, కర్బూజా, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని పూతికవలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు గ్రామంలోని ఏగిరెడ్డి సింహాచలానికి చెందిన 3 ఎకరాల కర్బూజ, పామాయిల్‌ పంటలను నాశనం చేశాయి. అప్పులు చేసీ మరీ కర్భూజ పంటను సాగుచేశానని, దిగుబడి వచ్చిన సమయంలో ఏనుగులు పంటను ధ్వంసం చేయడం వల్ల సుమారు 3 లక్షల వరకు నష్టపోవాల్సివచ్చిందని, ప్రభుత్వాధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తున్న పంటలను ధ్వంసం చేస్తూ తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగులు ఇప్పుడు జనావాసాల్లోనికి రావడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ఏనుగులను తరలించి తమ పంటలను, ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మన్యం జిల్లాలో తరచూ ఈ ఏనుగుల గుంపులు వచ్చి పంటలు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి.. దీంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. మన్యం జిల్లాలో ఇప్పటికే ఏనుగుల బారినపడి 12 మంది వరకూ మృతి చెందారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నష్ట పరిహారం కూడా ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!


కుంకీ ఏనుగులు రప్పించి ఇక్కడి గజరాజుల సమస్య పరిష్కరిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. త్వరితగతిన ఆ హామీని నిలబెట్టుకోవాలని రైతులు కోరారు. నెలలు గడుస్తున్నా కుంకీల విషయంలో ఇప్పటికీ ఏ విధమైన ముందడుగు పడకపోవడంపై అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు