Lady Aghori: ఆడ బిడ్డకు తల్లైన అఘోరి.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..!

అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పాటు బీటెక్ చదివిని యువతిని శిష్యురాలిగా వెంటపెట్టుకున్నారు. ఇకనుంచి ఆ యువతిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపారు. ఆమెకు కఠోర శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. ఆ యువతి కూడా తన ఫ్యామిలీకి చెప్పే వచ్చానని వెల్లడించింది.

New Update
Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku

Lady Aghori Disciple Shocking Comments

గతేడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు తాను ముందుకు వచ్చానంటోంది. ఈ క్రమంలో పలువురిపై ఆరోపణలు చేసింది. తాజాగా అఘోరీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక ఆడ బిడ్డకు తల్లైంది. తనతో పాటే ఒక ఆడ బిడ్డను వెంట పెట్టుకుని వెళ్తుంది. ఈ క్రమంలోనే RTV ఛానెల్‌లో మాట్లాడి.. పలు విషయాలు వెల్లడించింది. 

ఆ యువతిని కూతురిలా

తురెమెల్ల శ్రీవర్షిణి అనే ఒక యువతికి తాను దీక్ష ఇచ్చి.. సాధన నేర్పిస్తున్నానని తెలిపింది. ఆ యువతి జీవితాంతం తనతోనే ఉంటుందని పేర్కొంది. ఆమె బరువు బాధ్యతలు కూడా తానే తీసుకుంటున్నానని తెలిపింది. ఇలా చాలా మంది ఆడ పిల్లలు ఇప్పుడిప్పుడే తనవద్దకు వస్తున్నారని.. ఎవరైనా సరే ఇష్టపడి శిక్షణ నేర్చుకోవాలి అని అనుకుంటే.. భగవంతునికి సేవ చేసుకోవాలి అనుకుంటే తాను నేర్పిస్తానని తెలిపింది. తనను నమ్ముకుని వచ్చిన ఆడబిడ్డలను మంచి స్థితికి తీసుకుని వెళ్తానని చెప్పింది.  ఇక తనతో పాటు ఉన్న ఆడ బిడ్డను కూడా తనలాగే మహిళల కోసం పోరాడే వ్యక్తిలా తీర్చి దిద్దుతానని తెలిపింది.  

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

ఎలా పరిచయం అయిందంటే?

ఒక రోజు ఆ యువతి తనకు కాల్ చేసిందని.. తన దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పడంతో పరిచయం అయిందని పేర్కొంది. ఇక ఇలాంటి ఆడపిల్లలకు మాత్రమే తాను సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఆడ పిల్లలను ఆడ పులిలా తీర్చి దిద్దడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చింది. 

Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!

మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు..

ఇప్పటికే అఘోరీ వద్ద దీక్ష తీసుకున్నాను. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు.. ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని. ఇక నుంచి అఘీరీ అమ్మే అన్నీ చూసుకుంటానని చెప్పింది. సొంత కూతురిలా నన్ను చదివిస్తానని మాట ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఘోరీ అమ్మతో.. ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను అని ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు