AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఏపీ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల కోసం చేనేత వస్త్రాలపై 50% డిస్కౌంట్ సేల్ ప్రారంభమైంది. గురువారం, వెలగపూడిలోని ఆప్కో షోరూమ్‌లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణితో మంత్రి సవిత ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్సీ దొరస్వామి నాయుడు కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం నర్రావూరు ఆయన స్వస్థలం. దొరస్వామి నాయుడు మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. కొండపై ఉన్న వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్‌ను టీటీడీ చేర్చింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఏసీ సీఏం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యారు వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి.ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో.. నాలుగు ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాలలో లేడీ అఘోరీ అందరికీ తెలుసు. కారణం సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తోన్న హల్ చల్ అంతా ఇంతా కాదు. తాజాగా ఒక యువతితో మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి అఘోరిని తన కళ్ల ముందు కనిపించాలని ప్రాధేయ పడడం విశేషం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని నటుడు పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.