AP Crime: కడపలో ఘోర విషాదం.. లారీ ఢీకొని దంపతులు మృతి
కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయ పల్లె వద్ద ఆగి ఉన్న స్కూటర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పొలం పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.