TTD: తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష.. ఇక ఊరుకునేదే లేదు.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు!

తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. వేసవి సెలవుల్లో సిఫారసు లేఖలు బరాబర్ ఇస్తామని.. వాటిని పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజలంతా వచ్చి తేల్చుకుంటామన్నారు.

New Update
Raghunandan Rao On TTD

Raghunandan Rao On TTD

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కూడా స్వీకరిస్తాం అని చెప్పారన్నారు. ఇప్పుడు మార్చిలో ఉన్నా ఎందుకు స్వీకరించట్లేదని ప్రశ్నించారు. వేసవి సెలవుల్లో సిఫారసు లేఖలు జారీ చేస్తామన్నారు. వాటిని అనుమతించకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కోరుతున్న ఈ న్యాయమైన కోరికను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీనికి చంద్రబాబు సైతం స్పందించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు.

ఇటీవల చంద్రబాబుకు మంత్రి సురేఖ లేఖ..

అయినా వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఇక్కడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తక్షణమే పరిగణలోకి తీసుకునేలా టీటీడీని ఆదేశించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు