AP: పవన్ అన్న అంటూ మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్...

జనసేన పార్టీ ఈరోజు  12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. పవన్ అన్నకు నా మృదయపూర్వక శుభాకాంక్షలు అని అందులో రాశారు. 

New Update
ap

Pawan Kalyan, Nara Lokesh

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేశ్. ఇందులో పవన్ పిడికిలి బిగించిన పోటోను జత చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పెషల్ గా విషెస్ తెలిపారు లోకేశ్. ఇందులో పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అన్నకు, నాయకులు, కార్మికులు, అనుచరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ  లోకేశ్ ట్వీట్ లో రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన కృషి అభినందనీయం అని..వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ట్వీట్ రాశారు లోకేశ్. 

పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ సభ..

ఇవాళ పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 100 శాతం విజయంతో చరిత్ర సృష్టించింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అని జనసేన అధినేత పవన్ జనసైనికులకు  పిలుపునిచ్చారు. పిఠాపురంలో సభలో పవన్ కల్యాణ్ 90 నిమిషాల పాటూ ప్రసంగించనున్నారని తెలుస్తోంది. 

 Also read :  యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు