పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపిస్తున్నట్లుగా ప్రకటించాడు. దీంతో ఆ పార్టీ పెట్టి సరిగ్గా నేటికి 12ఏళ్లు పూర్తయింది. ఇవాళ జనసేన ఆవిర్భవ సభ జయకేతనం పేరుగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో భారీ ఏర్పాట్లతో సిద్ధమైంది. ఇందులో భాగంగానే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఒక్కసారిగా సభాప్రాంగణం లోపలికి జనసైనికులు దూసుకువచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ, గోడలు దూకి, స్టేజీ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జనసేన సైనికుల మీద లాటీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ సృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను పిఠాపురం హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు.