పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో భారీగా ‘జయకేతనం’ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్లు చేశారు.
Also Read : పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
పవన్ గెలవడానికి రెండు కారణాలు
ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని అన్నారు. పిఠాపురంలో పవన్ గెలవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అన్నారు. అందులో మొదటి కారణం పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆ తర్వాత రెండో కారణం జనసైనికులు, కార్యకర్తలు అంటూ నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Also read : రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
ఈ రెండు కారణాల వల్లే పవన్ విజయం సాధించారు అని తెలిపారు. దీంతో పవన్ గెలుపులో వర్మ పాత్ర లేదని నాగబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాగా 2024 ఎలక్షన్లలో పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. తన మద్దతు వల్ల పవన్ గెలిచాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటికి కౌంటర్‌గానే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో.
పవన్ కళ్యాణ్ నావల్లే గెలిచాడు అనుకుంటే అది నీ కర్మ: నాగబాబు. #Nagababu#PawanKalyan#YSJagan#Janasena#JanasenaFormationDay#Jayakethanam#JanasenaJayakethanam#JanaSena12thFormationDay#JanasenaFormationDay2025#Pithapuram#Chitrada#APPolitics#YCP#APNews#MangoNewspic.twitter.com/dgeYj4Z7Jx
— Mango News (@Mango_News) March 14, 2025
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
దీంతోపాటు మాజీ సీఎం జగన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని అన్నారు. నోటిదురుసు ఉన్న నేతకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని సెటైర్ వేశారు.