🔴Live News Updates: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
గ్రూప్ 1 పరీక్షా విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఇకపై మెయిన్స్ ఎగ్జామ్స్కు వైట్ పేపర్తో కూడిన బుక్లెట్ను అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ప్రకటించారు.
గుంటూరు సమీపంలోని బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఒక మహిళ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆపై తన ప్రియున్ని వాటేసుకుంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ ఆరుపదుల వయసుదాటినవారే కావడం విశేషం
సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని పేరెంట్స్ కు సూచించారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు.
టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసిందని ఆరోపించారు. తిరుమలలో మహాపచారం జరుగుతోందన్నారు.
ఏపీలో ఓ వివాహితపై జైలర్ లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. న్యూడ్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తున్నాడంటూ బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రేపు అనగా 2025 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి.