BIG BREAKING: 'తిరుమలలో మహాపచారం'

టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసిందని ఆరోపించారు. తిరుమలలో మహాపచారం జరుగుతోందన్నారు.

author-image
By Nikhil
New Update

తిరుమలలో మహాపచారం జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయన్నారు. గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసిందని ఆరోపించారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల సంరక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. టీటీడీ గోశాలలో గోవులను అమ్మకంటే అత్యంత పవిత్రంగా చూస్తారన్నారు. గోశాలలో పాప ప్రక్షాళన చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఈరోజు చేస్తున్నది ఏంటి? అని ప్రశ్నించారు.

గోశాలకు డైరెక్టర్ ఎక్కడ..?

మూడు నెలలుగా టీటీడీ గోశాలలో 100 కు పై గోవులు మృతి చెందాయన్నారు. మన పురాణలలో గో మాతకు విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. చనిపోయిన ఆవులకు కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదన్నారు. డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జి గా నియమించారన్నారు. గోశాలకు డైరెక్టర్ లేడన్నారు. కూటమి ప్రభుత్వంలో గోవులకు జరుగుతున్న అన్యాయం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. సాహి వాల్, గిర్, కాంక్రీజ్ తదితర 550 ఆవులను దాతల ద్వారా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుంచి మా పాలనలో తీసుకువచ్చామన్నారు.

1500 లీటర్ల పాలు, అన్నప్రసాదాలకు నిత్యం వినియోగించేవారన్నారు. ఈరోజు కూటమి పాలనలో 500 లీటర్లు పాలు కూడా గోశాల నుంచి తిరుమలకు వెళ్లడం లేదన్నారు. టీటీడీ గోశాలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. గోవులను పట్టించుకోవడం లేదని.. దుర్గంధం వస్తోందన్నారు. సాహివాల్ ఆవు గోశాల నుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయిందన్నారు. టీటీడీకి చెందిన ఆవు కాదని చెప్పేందుకు దాని చెవులు కట్ చేశారని ఆరోపించారు. గోశాలలో ఆవుల చనిపోయిన ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

(ttd | telugu-news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు