AP: గోరంట్ల మాధవ్ కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Ex MP Gorantla Madhav

నిన్న అరెస్ట్ అయిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు గుంటూరులోని ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 24 వరకు మాధవ్ కు, మిగతా ఐదుగురికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు పోలీసులు వారిని నల్లపాడు పీఎస్‌ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించి  వైద్య పరీక్షలు చేయించారు. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు. రిమాండ్‌ తిరస్కరించాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాల మేరకు మాధవ్ , మిగతా ఐదుగురిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. 

మళ్ళీ మాధవ్ దురుసు ప్రవర్తన..

కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఈరోజు గోరంట్ల మాధవ్ మళ్ళీ దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి కూడా నిరాకరించారు ఎంపీగా చేసిన వ్యక్తిని మీడియా ముందు తీసుకువస్తారా అంటూ గొడవ చేశారు.

మాజీ ఎంపీ, వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ చేబ్రోలును పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్‌కు తరలించారు. ఎస్పీ ఆఫీస్‌లోనే గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. కోపంతో కిరణ్‌పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల ముందే కిరణ్‌ను కొట్టాలని చూశాడు. గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్ అనుచరులతో కిరణ్‌పై దాడికి యత్నించాడు. గోరంట్ల మాధవ్ ఎస్కార్ట్ వాహనాన్ని సీజ్ చేసి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.కిరణ్ పై మొత్తం 4 కేసులు పెట్టామని ఎస్పీ సతీష్ తెలిపారు. కిరణ్ గతంలో మాజీ మంత్రి   విడదల రజినిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఎస్సీ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి ఇబ్రహింపట్నం దగ్గర అతన్ని అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ అధికారి తెలిపారు.

today-latest-news-in-telugu | mp-gorantla-madhav | 14 days remand 

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

Advertisment
తాజా కథనాలు