YS Sharmila: ఇలాంటి సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి... షర్మిల సంచలన కామెంట్స్ !

ఏపీ మాజీ సీఎం జగన్  సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు.

New Update
ysbharathi-sharmila

ysbharathi-sharmila

YS Sharmila: ఏపీ మాజీ సీఎం జగన్  సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని ఆమె అన్నారు. ఇలాంటి సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని మండిపడ్డారు.

Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!

నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉంది

సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు షర్మిల.  ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని షర్మిల డిమాండ్ చేశారు.  వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందని..ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీ నేతలేనని ఆమె ఆరోపించారు.  సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమని మండిపడ్డారు.  ఈ పార్టీలు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఫైరయ్యారు.  ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని షర్మిల పిలుపునిచ్చారు.  

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

మరోవైపు వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదంది. కిరణ్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టాలని జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేయడంతో..వారు అధిష్టానం ఆదేశాలతో కిరణ్ పై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు.  మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలంటూ అధిష్టానాన్ని కోరుతూ కిరణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Also Read: ‘సోదరా’ ట్రైలర్‌ చూశారా..? సంపూ రచ్చ మాములుగా లేదుగా!

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు