/rtv/media/media_files/2025/04/11/Nzb9yp1RSZFhcxGTtld5.jpg)
Suicide attempt
Suicide attempt : గుంటూరు సమీపంలోని బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఒక మహిళ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆపై తన ప్రియున్ని వాటేసుకుంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ట్విస్ట్ ఎంటంటే ఇద్దరూ ఆరుపదుల వయసుదాటినవారే కావడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!
బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి లక్ష్మీ నారాయణ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన నల్లమోతు మాధవి అనే మహిళతో కొంతకాలంగా సహాజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ కొద్ది రోజులుగా మాధవికి లక్ష్మీ నారాయణ దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో ఈరోజు (శుక్రవారం) రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వచ్చిన మాధవి అతడిని నిలదీసింది. తన వద్దకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. ఎందుకు దూరంగా పెడుతున్నావంటూ గొడవపెట్టుకుంది. కాసేపు ఇద్దరు వాదులాడుకున్నారు. అయితే లక్ష్మినారాయణ సైతం తను ఆమె వద్దకు రాకపోవడానికి కారణాలను వివరించే ప్రయత్నం చేశాడు.
Also Read: Tesla Cybertruck: టెస్లా సర్‌ప్రైజ్: కేవలం $69,990కి కొత్త సైబర్‌ట్రక్ విడుదల!
అయితే అవేం పట్టని మాధవి ఆగ్రహంతో ఊగిపోయింది.ముందుగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకుంది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతటితో ఆగకుండా నాతో పాటే నువ్వు కూడా అంటూ లక్ష్మీనారాయణను వాటేసుకుంది. దీంతో ఇద్దరికి కూడా మంటలు అంటుకున్నాయి. దాదాపు 50 శాతం వరకు ఇద్దరు కాలినట్లు తెలుస్తోంది. మంటలు అంటుకున్న వెంటనే లక్ష్మీ నారాయణ కాపాడాలంటూ బయటకు పరుగులు తీశాడు. ఆ తరువాత అక్కడే మెట్లపై కూర్చుండిపోయాడు. మహిళ కూడా అక్కడే కూర్చుండిపోయింది.
Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?
వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరి మంటలను ఆర్పి వేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే పూర్తి స్థాయిలో మంటలు అంటుకోవడంతో యాభై శాతం వరకు శరీరాలు కాలిపోయాయి. ప్రస్తుతం వారికి బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా పట్టపగలు రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు ఆరుపదుల వయస్సులో ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర బంధం గుట్టు రట్టయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Also read : తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ