AP News : అవినీతి ఆరోపణలు.. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు!

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి.

New Update
osd kollu

osd kollu

గనుల శాఖపై ఆరోపణలు నేపథ్యంలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని చంద్రబాబు సర్కార్‌ పక్కన పట్టేసింది. సీఎం ఆదేశాల మేరకు ఆయన్ను ప్రభుత్వం తొలగించింది. రాజాబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ  పట్టుపట్టి మరీ మంత్రి రవీంద్ర ఆయన్ను ఓఎస్డీగా నియమించుకున్నారు. అయితే పది నెలల పాలనలో గనులశాఖ పనితీరు, అప్పీల్‌ రివిజన్‌ కేసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇవి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే రిపోర్టు తెప్పించుకున్నారు.  అనంతరం అతన్ని తొలిగించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది.

Also read :  తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ

Also Read :  Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!

ఆఫీసుకు కూడా రావడం లేదు

రాజాబాబు గత కొద్దిరోజులుగా ఆఫీసుకు కూడా రావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లుగా సమాచారం. ఎలాగూ ప్రభుత్వం తనను తప్పించబోతోందన్న సమాచారంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  రాజాబాబు గనుల శాఖలో జాయింట్‌డైరెక్టర్‌గా పనిచేస్తూ 2024 మార్చిలో రిటైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్‌డీగా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రస్తుతం గనులశాఖలో సబ్ జాయింట్‌ డైరెక్టర్‌ గా ఉన్న శ్రీనివాసచౌదరిని ఓఎస్‌డీగా నియమించే అవకాశం ఉంది.

Also read : Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!

Also read : ఇది మామూలు ప్లానింగ్ కాదు భయ్యా.. అమెజాన్ ఆర్దర్లతో పగ మాజీ గర్ల్ ఫ్రెండ్ పై ప్రతీకారం!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు