నేడే కేబినెట్ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్‌కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.
శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
అందరూ అనుకున్నట్లుగానే అఘోరీ - వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వర్షిణీ స్వయంగా తెలిపింది. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో బ్రహ్మముహూర్తం సమయంలో అఘోరీ.. తన మెడలో తాళి కట్టింది అని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. 9552300009కు Hi అని మెసేజ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి.
గ్రూప్ 1 పరీక్షా విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఇకపై మెయిన్స్ ఎగ్జామ్స్‌కు వైట్ పేపర్‌తో కూడిన బుక్‌లెట్‌ను అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ప్రకటించారు.
సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని పేరెంట్స్ కు సూచించారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు.