/rtv/media/media_files/2025/05/01/8zWhHTv93y1KolSvJzqO.jpg)
ap dsc Photograph: (ap dsc)
AP GOVT JOBS: ఏపీ మెగా డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదలైంది. 421 ఉద్యోగాలు క్రీడా కోటా కింద భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. రాత పరీక్ష లేకుండా, సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మే 2 నుంచి 31 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
డీఎస్సీ-2025లో 3శాతం..
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025లో భాగంగా 3శాతం క్రీడా కోటా నోటిఫికేషన్ విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రీడా శక్తిని సమాజాభివృద్ధికి వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని, ఇది ఒక సమర్థ సమాజ నిర్మాణానికి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.
హారిజాంటల్ రిజర్వేషన్..
క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. మెగా డీఎస్సీ లో విడుదల చేసిన 16,347 పోస్ట్ ల్లో క్రీడా కోటా క్రింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద కేటాయిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాకు ఎంపిక పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నిష్పక్షపాతంగా కేవలం అర్హులందరికీ న్యాయం జరిగిలా చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాం. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇన్సెంటీవ్ లు అందిస్తాం. ఫేక్ సర్టిఫికెట్లపై ఉక్కుపాదం మోపుతాం అని ఆయన హెచ్చరించారు.
Also Read: టాబ్లెట్ వేసుకున్నా జ్వరం తగ్గకపోతే ఈ టెస్టులు చేయించుకోండి
మెగా డీఎస్సీలో క్రీడా కోటా క్రింద ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 333 పోస్టులు ఇవ్వనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 30, ట్రైబల్ వెల్ ఫేర్ ఆశ్రమ్ పాఠశాలల్లో 22, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2, మోడల్ పాఠశాలల్లో 4, సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7, గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 23 పోస్టులు కేటాయించినట్లు వెల్లడించారు. క్రీడలలో ప్రతిభ చూపిన యువతకు ఇది ఒక అపూర్వ అవకాశమని, స్థిరమైన జీవితం, గౌరవం, ఉద్యోగ భద్రత లభించేందుకు ఇది మార్గంగా పేర్కొన్నారు మంత్రి రాంప్రాసాద్.
Also Read: కడుపులో నులిపురుగులు పోవాలా.. లవంగంతో ఇలా చేయండి
ap-dsc | sports | notification | telugu-news | today telugu news