/rtv/media/media_files/2025/04/29/1ntsll9uAPUui2cC01GD.jpg)
Telangana CM Revanth Reddy AP tour
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీకి వెళ్లనున్నారు. విజయవాడలో రేపు జరగనున్న మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు రేవంత్ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఏపీకి చెందిన టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేవినేని ఉమా హైదరాబాద్ లో రేవంత్ ను కలిసి తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు. గతంలో ఉన్న సన్నిహిత్యం దృష్ట్యా రేవంత్ రెడ్డి ఆ వివాహ వేడుకకు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka : ఆపరేషన్ కగార్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, మిత్రులు @Vemnarenderredy మరియు కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారిని హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి నా కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. pic.twitter.com/60ryUCKHk6
— Devineni Uma (@DevineniUma) April 24, 2025
అమరావతికి కూడా వెళ్తారా?
మే 2న అమరావతి పునఃప్రారంభం పనులకు ప్రధాని మోదీ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఎన్డీయేలోని ఇతర పార్టీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది. గతంలో అమరావతి శంకుస్థాపన వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించగా.. ఆయన హాజరైన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఆహ్వానిస్తారా?.. ఆహ్వానిస్తే ఆయన వెళ్తారా? అన్న చర్చ ఇరు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌కు గాయం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్
(telugu-news | latest-telugu-news | telugu breaking news)