Tirumala : తిరుమల భక్తులకు అలెర్ట్... ఆ రెండు రోజులు దర్శనాలు రద్దు!
తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 జులై 15,16వ తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా టీటీడీ తెలిపింది.