Tirupati: తిరుపతిలో మరో మహా అద్భుతం! సాయిబాబా విగ్రహం నుంచి రాలుతున్న విభూతి! (వీడియో)

తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

New Update

Tirupati: తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండు సంవత్సరాలుగా ఇదే విధంగా సాయిబాబా పటం, విగ్రహం నుంచి విభూతి రాలడం గమనిస్తున్నట్లు  సదరు ఇంటి  మహిళ తెలియజేసింది. రాత్రంతా ఇల్లంతా విభూది సువాసన వెదజల్లడంతో పూజ మందిరం దగ్గరికి వెళ్లి చూడగా.. ఆశ్చర్యానికి గురైందట మహిళ! బాబా విగ్రహం నుంచి విభూతి రాలుతూ కనిపించిందట. ఇది చూసిన కుటుంబ సభ్యులు, చుట్టు పక్కన వాళ్ళు అంతా సాయిబాబా లీలలు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మరికొందరు ఇలా జరుగుతుందేంటీ? అని భయాందోళనలకు గురవుతున్నారు. 

దీంతో అక్కడి కాలనీ వాసులంతా ఆ దృశ్యాలను చూసేందుకు క్యూ కట్టారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇటీవలే కళ్లు తెరిచిన శివుడు

ఇదిలా ఉంటే రీసెంట్ గా కూడా తిరుపతిలో ఇలాంటి సంఘటన జరిగింది. తిరుపతిలోని గాంధీపురంలో  స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడు కళ్ళ తెరిచిన మహా అద్భుత ఘటన చోటుచేసుకుంది. లింగ రూపంలో ఉన్న పరమ శివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో అక్కడి కాలనీ వాసులు, చుట్టు పక్కన ఉన్న గ్రామస్థులు ఆలయానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. సాధారణంగా శివుడు మూడో కన్ను తెరవడం, భక్తుడి ఘోర తప్పసుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమవడం వంటివి  సినిమాల్లో మాత్రమే  సంఘటనలు చూస్తుంటాము! అలాంటిది నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలియడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisment
తాజా కథనాలు