/rtv/media/media_files/2025/09/18/renigunta-fire-accident-2025-09-18-09-16-47.jpg)
Renigunta fire accident
తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెక్సన్ మొబైల్ కంపెనీ పక్కనే ఉన్న మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు దాదాపు 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా చెలరేగడంతో ఫ్యాక్టరీలోని బ్యాటరీలు, మిషనరీ, ముడి పదార్థాలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.70-80 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
— RTV (@RTVnewsnetwork) September 18, 2025
డెక్సన్ మొబైల్ కంపెనీ పక్కనే ఉన్న మోనిత్ బ్యాటరీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటన అర్ధరాత్రి సుమారు 2.30 గంటలకు చోటు చేసుకుంది.
మంటలను అదుపు చేసేందుకు సుమారు 10 ఫైర్ ఇంజన్లు… pic.twitter.com/PTHhtUX4QV