Weather Update: మరో రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

మరో రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించారు. కరీంనగర్‌, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

New Update
Rains In Telugu States

Rains

తెలంగాణ(Telangana) లో మళ్లీ వర్షాలు మొదలు కాబోతున్నాయి. మరో రెండు గంటల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించగా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అధికారులు విధించారు. కరీంనగర్‌, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి:  Indiramma's houses : ఇందిరమ్మ ఇండ్లకు గుడ్‌ న్యూస్‌.. వాటికి అదనపు నిధులు

ఇక ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, భూపాలపల్లి, జనగామ, ఖమ్మం, జగిత్యాల, కొమురంభీం జిల్లా, మేడ్చల్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి జిల్లా్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరం పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు తెలిపారు. 

ఏపీలో ఈ జిల్లాల్లో..

ఇక ఏపీ(AP) విషయాని కొస్తే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, విజయవాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం వల్ల ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అయితే జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Kavitha issue: కవిత గురించి మాట్లాడే ప్రసక్తే లేదు.. KTR ఫస్ట్ రియాక్షన్

Advertisment
తాజా కథనాలు