పాఠశాలలో పాము కాట్లు
జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకులంలో పాము కాటుకు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇదే రూములో పడుకున్న మరో విద్యార్థి అదే సమయంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
వర్షాకాలంలో పాము కాటుకు గురైన సంఘటనలు ఎక్కువగా వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా ఆందోళన చెందడం మానేయాలి. ప్రథమ చికిత్సగా శరీరంలో విష ప్రభావం తగ్గించడానికి బోడ కాకరకాయ లేదా వెల్లుల్లి పేస్ట్ ను కాటేసిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఆ తర్వాత వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో రెండు రోజుల పాటు వేలాడదీశారు. గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు చెప్పడంతో వారు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పాము కాటుకు గురైన వ్యక్తికి మొదటగా ధైర్యం చెప్పాలి. టెన్షన్ పడకుండా అతడిని కూల్ చేయాలి. గాయమైన చోట కదిలించకూడదు. గాయపడిన ప్రాంతంలో ఏదైనా బట్టలు, ఆభరణాలు ఉంటే వెంటనే తీసేయాలి. వెంటనే రోగిని ఎడమ వైపు పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెబుతున్నారు.