Puducherry Yoga Mahotsav IYD 2025: కౌంట్‌డౌన్ స్టార్ట్.. పుదుచ్చేరిలో ప్రారంభమైన యోగ మహోత్సవాలు.. 6,000 పైగా హాజరు!

అంతర్జాతీయ యోగ దినోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా పుదుచ్చేరిలో యోగా మహోత్సవాన్ని నిర్వహించగా 6,000 పైగా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

New Update
MDNIY yoga event at Puducherry

Puducherry Yoga Mahotsav IYD 2025

Puducherry Yoga Mahotsav IYD 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025(International Day of Yoga 2025)కి  25 రోజుల కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా  మే 27న  పుదుచ్చేరి బీచ్ రోడ్  గాంధీ తిదల్ వద్ద  భారీ ఎత్తున యోగ మహోత్సవాన్ని(Puducherry Events) నిర్వహించడం జరిగింది. ఇందులో  6,0000 పైగా యోగా ప్రియులు పాల్గొన్నారు. ఈ మహోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ(Ministry of Ayush)కి చెందిన మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) నిర్వహించింది. సాంప్రదాయ నృత్యాలు, యోగాసనాలతో మహోత్సవం సందడిగా జరిగింది. 

 Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

IYD 2025
IYD 2025

 

 Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

ఈ ఏడాది IYD థీమ్

ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాధవ్, లెఫ్టినెంట్ గవర్నర్ తి. కె. కైలాశనాథన్, ముఖ్యమంత్రి తి. ఎన్. రంగస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  యోగాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను, మానసిక శాంతిని, ప్రపంచ ఆరోగ్యంపై  యోగా ప్రభావాన్ని వివరించారు. అలాగే ఈ ఏడాది యోగ దినోత్సవం థీమ్  "Yoga for One Earth, One Health" అని సూచించారు. 

IYD 2025 EVENT
IYD 2025 EVENT

 

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

MDNIY యాజమాన్యం కామన్ యోగా ప్రోటోకాల్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన యూట్యూబ్,  సోషల్ మీడియా వేదికలపై ప్రత్యక్ష ప్రసారమైంది. Yoga Sangam పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 12,000 మందికి పైగా యోగ కోర్సులో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఈ మహోత్సవం పుదుచ్చేరిని ప్రపంచ యోగా పటంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. యోగా వ్యక్తిగత ఆరోగ్యమే కాక, సమాజ శ్రేయస్సుకు కూడా ఎంతో ఉపయోగకరమని ఈ కార్యక్రమం నిరూపించింది.

IYD 2025 Puducherry event
IYD 2025 Puducherry event

 

Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!

అంతర్జాతీయ యోగా దినోత్సవం( IYD) 2025 సందర్భంగా  10 ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు.  అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

  • Yoga Sangam – దేశవ్యాప్తంగా 1 లక్ష ప్రాంతాల్లో సమకాలీన యోగా ప్రదర్శనలు
  • Yoga Bandhan – అంతర్జాతీయ యోగా మార్పిడి కార్యక్రమాలు
  • Yoga Parks – స్థిరమైన యోగా పార్కుల నిర్మాణం
  • Yoga Samavesh – వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక కార్యక్రమాలు
  • Yoga Prabhav – యోగా ప్రభావంపై 10 ఏళ్ల అధ్యయనం
  • Yoga Connect – అంతర్జాతీయ యోగా సదస్సు
  • Harit Yoga – పర్యావరణ పరిరక్షణతో కూడిన యోగా
  • Yoga Unplugged – యువతలో యోగా చైతన్యం
  • Yoga Maha Kumbh – దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో వారం రోజుల యోగా ఉత్సవాలు
  • Samyoga – ఆధునిక వైద్యంలో యోగా ఆధారాల అన్వయనం
Advertisment
Advertisment
తాజా కథనాలు