/rtv/media/media_files/2025/05/28/Seta6t4cvTjopMVxZyX0.jpg)
Mahanadu NTR AI VIDEO
ఏపీలోని కడపలో టీడీపీ మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. అయితే ఈ మహానాడు వేదికపై ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
Mahanadu NTR AI Video
దివంగత సీనియర్ ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘‘సికింద్రాబాద్‌కు ట్యాంక్ బండ్‌తో నేను సాంస్కృతిక వారథి కడితే.. ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి.. తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారిథిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏ నాడైనా కలగన్నామా?.. దాన్ని సాధ్యం చేసింది నా తెలుగు దేశం ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వంగా ఉంది.
Also Read: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా
ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్.
— RTV (@RTVnewsnetwork) May 28, 2025
మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు.@ncbn @naralokesh #SrNTR #AIvideo #speech #TDPleaders #RTV pic.twitter.com/mo8AhodqrC
డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాంతంత్య్రం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో.. పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆ నాడు నేను కలవరించాను.
Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకో రెండేళ్లలో నెరవేరబోతుంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా.. డొక్క సగం నిండని పేద ప్రజానికానికి ఇంత ఆదర్వు కల్పించడానికే ఆనాడు కిలో రూ.2 బియ్యం పథకం పెట్టాను అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దీంతో పాటు మరెన్నో విషయాలు అందులో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఐఏ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.