Pawan Kalyan OG Shooting: ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

OG సినిమా షూటింగ్ కోసం ముంబై వీధుల్లో పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కొత్త లుక్‌లో పవన్ స్టైల్‌తో అదరగొట్టారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పవన్ కమ్‌బ్యాక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

New Update
Pawan Kalyan OG movie Shooting video viral

Pawan Kalyan OG movie Shooting video viral

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయలు, మరోవైపు తాను ఒప్పుకున్న సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ 12న రిలీజ్ కానుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సైతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 

OG Shooting video

Also Read: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

ఇక మరో మోస్ట్ వైలెంటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’. ఇప్పుడంతా ఈ సినిమా గురించే చూస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే’ అంటూ సాగే సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

Also Read: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది చివరి దశకు చేరుకుంది. కొన్ని సన్నివేశాలు పవన్ పై చిత్రీకరించి షూటింగ్‌ను క్లోజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే తాజా షూటింగ్‌లో పవన్ కల్యా్ణ్ పాల్గొన్నారు. OG సినిమా షూటింగ్ కోసం ముంబై వీధుల్లో పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కొత్త లుక్‌లో పవన్ స్టైల్‌తో అదరగొట్టారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పవన్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

telugu-news | latest-telugu-news | Pawan Kalyan | OG Movie Shooting | og-movie

Advertisment
Advertisment
తాజా కథనాలు