Andhra Pradesh: 10వ తరగతి విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష వాయిదా
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తో పాటు 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కారు ఓవర్‌టెక్ చేసే క్రమంలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన జరిగింది. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి మారే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది 9, 10 తేదీల్లో తెల్లవారుజామున భానుడి కిరణాలు అరసవల్లి ఆలయంలోని మూల విరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.
తనకు ఇష్టమైన నటుడు బాలయ్య అని ఇండియా టుడే కాన్క్లేవ్లో నారా లోకేష్ తెలిపారు. ఇష్టమైన ప్రదేశం అరకు వ్యాలీ అని.. ఫేవరెట్ ఫుడ్ ఉలవచారు బిర్యానీ అని వెల్లడించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు.
రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కు రూ.9,400 కోట్లను కేటాయించారు. విత్తన రాయితీ, వడ్డీలేని రుణాలతో పాటు కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.