Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!
శ్రీకాకుళం జిల్లాలోని మందసలో చారిత్రకమైన శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చివరి రోజు రథయాత్ర ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో డీజే పాటలకు పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.