/rtv/media/media_files/2025/03/19/jWaQbr2YiWT9i7lcPdV5.jpg)
Weather
తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఏపీలో కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు వేదావతి నది ఉప్పొంగుతుంది.
ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్...! ఉరేసుకుని భార్య...
7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST Dated : 21/05/2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/ZTNYeCkdlZ
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 21, 2025
ఇది కూడా చూడండి: Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నీట మునిగింది. అలాగే మంగళవారం అర్థరాత్రి నుంచి ముంబై, పూనే నగరాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. అలాగే నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’