Maoist Keshavarao: మావోయిస్టు కేశవరావు చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పోలీసులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మానసికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు RTVతో తెలిపారు.
అధికారిక ప్రకటన చేయట్లేదు..
ఈ మేరకు నంబాల కేశవరావు మృతిపై రకరకాలుగా ప్రకటనలు వస్తున్నాయని, ఇంతవరకు సరైన నిర్ధారణ లేదన్నారు. సోషల్ మీడియాను నమ్మే పరిస్థితి లేదని, ఒకవేళ ఆయన మరణించి ఉంటే అధికారికంగా ఫొటోలు విడుదల చేయాలని అన్నారు. అలాగైతేనే ఆయన చనిపోయినట్లు నమ్ముతామన్నారు. ఇక కేశరావు గ్రామస్థులు సైతం కేశవరావు మరణవార్త నిజం కాదంటున్నారు. పోలీసుల తప్పుడు ప్రచారం ఆయన కుటుంబాన్ని మానసికంగా కృంగతీస్తుందంటున్నారు.
Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!
ఇక కేశవరావుకు చినప్పటినుంచి కష్టపడేతత్వం ఉందని చెప్పారు. ఒకవైపు చదువుతూనే మరోవైపు వ్యవసాయం చేసేవాడని తెలిపారు. చదవు పూర్తిచేసి ఉద్యోగం చేస్తాడనే సమయంలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లాడన్నారు. ఒకసారి తమకు కలిసేందుకు వచ్చినపుడు జనజీవన స్రవంతిలో కలవాలని చెబితే చిరు నవ్వు నవ్వి ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయాడని వివరించారు. పూర్తి సమాచారం కోసం కింది వీడియో చూడండి.
After gunning down 27 dreaded Naxalites, including Central Committee Secretary Basavaraju, check out the electrifying triumph of DRG warriors straight from Ground Zero!
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 22, 2025
Jai Hind 🇮🇳 – the spirit of victory roars louder than ever! pic.twitter.com/j6YRaHdsSq
keshava-rao | telugu-news | today telugu new today telugu news