Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update

పాస్టర్ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాస్టర్ ప్రవీణ్‌ ది ముమ్మాటికీ హత్యే అని జీవీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇందుకు సంబంధించి హర్షకుమార్ సాక్ష్యాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు దర్యాప్తు అధికారికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, రాజానగరం పోలీస్ట్ స్టేషన్ పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసులను జీవీ హర్షకుమార్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ నోటీసులు నిజాన్ని దాయగలవా? హర్షకుమార్ ను ఆపగలవా? అంటూ పోస్ట్ చేశారు. 

Also Read :  ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!

Also Read :  ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!

ముమ్మాటికీ హత్యే: హర్ష కుమార్ ఆరోపణలు

ఇదిలా ఉంటే.. ప్రవీణ్‌ మృతిపై మాజీఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముమ్మాటికీ ఇది హత్యేనన్నారు. ప్రవీణ్‌ది హత్య అనడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయన్నారు. హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు లేదా క్రైస్తవ మతోన్మాదులు ఈ హత్యకు కారణం కావొచ్చన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే కేసుపై అనుమానాలు రేకెత్తాయన్నారు.

Also Read :  ప్రవీణ్ ది హత్యే.. పోలీసులు దాస్తున్న విషయాలివే.. మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు!

పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కేసు విచారణ సక్రమంగా జరగకపోతే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లి రీ ఇన్వెస్టిగేషన్ జరిగేలా చూస్తానన్నారు. నిన్న తాము సంయమనం పాటించడం వల్లే పోలీసులు మృతదేహాన్ని హైదరాబాద్ తరలించగలిగారన్నారు. 

(telugu-news | latest-telugu-news | telugu breaking news | today-news-in-telugu | telugu crime news | andhra-pradesh-news)

Also Read :  పాస్టర్ ప్రవీణ్ ను చంపింది వాడే.. నా దగ్గర ప్రూఫ్స్.. కేఏ పాల్ సంచలనం!-VIDEO

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు