శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద
శ్రీశైలం నిండుకుండలా మారింది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంలో 876 అడుగుల నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు మాత్రమే. దీంతో 3 గేట్లు ఎత్తారు అధికారులు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 57,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇవాళ లేదంటే రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలశాయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. కుడిగట్టు, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.