Photo Bid Goes Wrong : ఫోటో కోసం పోజులియ్యబోయిననేత.. కాలు జారడంతో...

ఓ గుడి వద్ద జరుగుతున్నపనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. స్పందించిన కార్మికులు ఆయనను బయటకు తీశారు.  

New Update
Photo bid Goes Wrong

Photo bid Goes Wrong

ఓ గుడి వద్ద జరుగుతున్న పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read :  అందంతో అగ్గి రాజేసున్న బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ లుక్స్.. హాట్ ట్రీట్ అదిరిందిగా!

Photo Bid Goes Wrong


వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సియోని జిల్లాలో ఉన్న చిత్రగుప్త ఆలయం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ ఆ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా ఫొటోలకు ఫోజులిచ్చేందుకు ప్రయత్నించారు.

Also Read:Baahubali The Epic Run Time: బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం‌పై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!

తట్టలో ఉన్న కాంక్రీట్‌ మెటీరియల్‌ను కార్మికురాలి నుంచి తీసుకుని లోతైన గోతిలో పోశారు. మొదట ఒక తట్ట సిమెంట్‌ అందులో పోసినప్పటికీ ఆ ఫోటో సరిగా రాలేదని కెమెరా తీస్తున్న వ్యక్తి తెలిపారు. దీంతో మరో ఫోటో దిగేందుకు ఉపక్రమించాడు. దానికోసం మరో కార్మికుడి వద్ద నుంచి తట్టను  ప్రఫుల్ శ్రీవాస్తవ అందుకున్నారు. కాంక్రీట్‌ మెటీరియల్‌ గోతిలో పోస్తుండగా కాలు జారింది. దీంతో ఆయన ఆ గోలిలోనే పడిపోయాడు. వెంటనే స్పందించిన కార్మికులు ఆయనను బయటకు తీశారు.

Also Read : తిరుమలలో కలకలం.. లోయలో దూకిన భక్తుడు

అయితే ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘సేవలో నాటకీయత వద్దు. సింపుల్‌గా ఉండండి’ అని ఒకరు వ్యాఖ్యానించారు. కాగా ఫోటోలకు ఫోజులివ్వడం కాదు. పనుల్లో నిజాయతీ ఉండాలని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం

video-goes-viral | chairman | temple | madyapradesh

Advertisment
Advertisment
తాజా కథనాలు