Srikakulam : అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు.

New Update
FotoJet (18)

MLC Duvvada Srinivas

MLC Duvvada Srinivas : శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన సోదరులు తనపై కుట్రకు తెరలేపారని దువ్వాడ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కాగా, గత కొంతకాలంగా ధర్మాన సోదరుల అక్రమాలపై దువ్వాడ గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్వెల మాధురికి నిమ్మాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్‌ కాల్ చేశారు. రెండు రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్వెల మాధురికి నిమ్మాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్‌ కాల్ చేశారు. దువ్వాడపై ధర్మాన సోదరులు దాడి చేయబోతున్నారని తెలిపారు. త్వరలో నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర దువ్వాడపై దాడి చేయాలని ధర్మాన సోదరులు వ్యూహం రచించినట్లు మాధురికి అప్పన్న చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు. తనపై కుట్ర జరుగుతోందని దువ్వాడ అన్నారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందుకోసం అల్లరి మూకలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు.శుక్రవారం అర్ధరాత్రి  నిమ్మాడ జంక్షన్ వద్ద  ప్రత్యక్షమైన దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యర్థులకు గట్టిగా సవాల్‌ విసిరారు. అర్థరాత్రి సమయంలో తన ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసరడం జిల్లావ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. నిమ్మాడ జంక్షన్ వేదికగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ"చంపాలనుకుంటే రండి.. నేను రెడీ!" అంటూ సవాల్‌ విసిరారు.

నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. "నన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే రండి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, దేనికైనా సిద్ధం" అంటూ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎదుటివారిని ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ ఆయన నిలదీశారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం సరైంది కాదని దువ్వాడ అన్నారు. 

మంత్రి అచ్చెన్నాయుడు, ధర్మాన కృష్ణదాస్‌లను 'కేడీ బ్రదర్స్'గా అభివర్ణించిన దువ్వాడ, వారిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చుతున్నారని మండిపడ్డారు, ఒకరు అధికార పార్టీలో, మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని తీవ్రంగా ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సవాళ్లు విసరడంతో నిమ్మాడ జంక్షన్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూనే, భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందుకోసం అల్లరి మూకలను సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తనను చంపడానికి ఎవడొస్తాడో రండి అంటూ నేషనల్ హైవేపై నిలబడి దువ్వాడ సవాల్ విసిరారు. తనకు ఏం జరిగినా ధర్మాన సోదరులదే బాధ్యత అని అన్నారు. ఈ వ్యహారంపై నేడు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని దువ్వాడ చెప్పారు. ప్రస్తుతం దువ్వాడ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు