/rtv/media/media_files/2025/09/03/lunar-eclipse-2025-09-03-14-29-40.jpg)
lunar eclipse
Chandra Grahan 2025: చంద్రగ్రహణం అనేది భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు కదలి వచ్చినప్పుడు ఏర్పడే ఖగోళ దృగ్విషయం. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడి, అది తాత్కాలికంగా అదృశ్యమవుతుంది. ఈ అద్భుత దృశ్యం పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన ప్రక్రియ. అయితే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం నాడు సంభవించనుంది. ఈ గ్రహణం రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదు రాశుల వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ రాశుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కొన్ని రాశులపై చంద్రగ్రహణం ప్రభావం..
మేష రాశి: ఈ రాశి వారికి ఈ గ్రహణం వృత్తిపరమైన జీవితంలో సవాళ్లను తీసుకురావొచ్చు. కెరీర్‌లో వచ్చే అవకాశాలను చేజార్చుకోకుండా ఉండాలంటే.. అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. ఇతరుల సలహాలను వినడం వల్ల నష్టం ఉండకపోవచ్చు. ప్రేమ జీవితంలో భాగస్వామి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం.
వృషభ రాశి: వీరికి నిందలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనస్తాపం చెందవచ్చు. కోపం, అహంకారం ఈ సమయంలో మీకు హాని చేయవచ్చు. వినయంతో వ్యవహరించడం శ్రేయస్కరం.
కన్య రాశి: వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వ్యక్తిగత నష్టానికి దారితీస్తాయి. ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం.
ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆ రాశుల వారికి డేంజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ప్రతికూల ఆలోచనలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కొంతమంది అసూయపరులు మీకు సమస్యలు సృష్టించవచ్చు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు కుటుంబంలో కలహాలు, ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. గత అనుభవాలు మనసును కలవరపెట్టవచ్చు. ఈ కఠిన సమయంలో ధైర్యం కోల్పోకుండా ఉండాలి. ఈ రాశుల వారు గ్రహణం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: 100 ఏళ్ల తర్వాత అరుదైన చంద్రగ్రహణం.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?