/rtv/media/media_files/2025/09/02/lunar-eclipse-2025-09-02-15-24-49.jpg)
lunar eclipse
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసా..? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహం ఏర్పడుతుంది. సూర్యుడు కాంతిని విడుదల చేసే మూలం, భూమి సూర్యుడి కాంతిని అడ్డుకుని.. నీడను ఏర్పరుస్తుంది, చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు.. సూర్యరశ్మి చంద్రుడిపై పడదు. దాంతో చంద్రుడు చీకటిగా కనిపిస్తాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్నే చంద్రగ్రహణం అని అంటాం. చంద్రగ్రహణాలు ప్రధానంగా మూడు రకాలు. సంపూర్ణ , పాక్షిక, ఉపచ్ఛాయ చంద్రగ్రహణాలు. సెప్టెంబర్ 7 ఆదివారం నాడు ఈ ఏడాదిలో రెండో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఈ చంద్ర గ్రహణం అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. పితృపక్షం సమయంలో సంభవిస్తున్న ఈ గ్రహణం కేవలం ఆకాశాన్ని మాత్రమే కాకుండా.. మన ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహణం సుమారు 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని చెబుతున్నారు. శాస్త్రీయ దృక్పథం ప్రకారం.. సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు బ్లడ్ మూన్‌గా ఎర్రటి రంగులో కనిపిస్తాడు. ఈ అరుదైన దృశ్యం రాత్రి 11:00 నుంచి 12:22 గంటల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది.
గ్రహణ ప్రభావం..
సనాతన ధర్మం ప్రకారం.. గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు. ఈ సమయంలో పూజలు చేయడం కూడా నిషేధం. ఈ సమయంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని కారణంగా దేవాలయాల తలుపులు మూసి వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత దేవాలయాలను శుద్ధి చేసి, దేవునికి స్నానం చేయిస్తారు. పితృ పక్షంలో ఈ గ్రహణం రావడం పూర్వీకులకు గౌరవం ఇచ్చే అరుదైన ఖగోళ సంఘటనగా చెప్పేవారు. గ్రహణ సమయంలో సూక్ష్మజీవుల చురుకుదనం పెరుగుతుందని.. దీనివల్ల ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. వండిన ఆహారంలో తులసి ఆకులను ఉంచడం ద్వారా ఈ ప్రభావాలను నివారించవచ్చని శాస్త్రీయ గ్రంథాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం, ఇతర భగవన్నామ స్మరణ చేయడం వల్ల 1000 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. ఈ గ్రహణానికి సుమారు 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.
ఇది కూడా చదవండి:నేడు ఈ రాశుల వారి పంట పండినట్లే.. ఏ పని తలపెట్టిన విజయం తథ్యమే!
భారత కాలమానం ప్రకారం.. సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గంటలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. సూదులు, కత్తెర్లు వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. నిద్రపోకుండా.. దేవుడి నామస్మరణతో గడపాలి. గ్రహణం ముగిసిన తర్వాత గంగాజలంతో స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పేదలకు ఆహారం, ఇతర వస్తువులు దానం చేయాలి. దేవుని నామస్మరణ చేసి.. ప్రార్థనలు చేయాలని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం చూడటానికి కళ్ళకు ఎటువంటి రక్షణ అవసరం లేదు. దీన్ని నేరుగా చూడవచ్చు. ఇది చాలా అరుదుగా జరిగే ఒక ప్రకృతి అద్భుతం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:సెప్టెంబర్‌లో ఆ రాశుల వారికి డేంజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!