చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని లక్ష్మి సినిమా హాల్ సమీపంలో ఓ ఇంట్లో దూరారు. దొంగలు ఇంటి వారిని తుపాకులతో బెదిరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
Gun
Mar 12, 2025 09:36 IST
సినిమా లెవెల్లో షాపింగ్ మాల్ లోని దొంగలు.. చిత్తూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్
చిత్తూరు జిల్లా గాంధీరోడ్‌లోని పుష్ప షాపింగ్ మాల్ లో దొంగలు హల్‌చల్ చేశారు. తుపాకులతో భవనంలోకి చొరబడి దొంగతనానికి యత్నించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బిల్డింగ్ చుట్టూ మోహరించి ఐదుగురు దొంగలను పట్టుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రచ్చ చేశారంటూ పలువురు యువకులకు మధ్యప్రదేశ్ పోలీసులు గుండ్లు కొట్టించారు. ఈ ఘటన దెవాస్ లో చోటుచేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొంటూ వారికి గుండ్లు కొట్టించి ర్యాలీ తీయించారు.
Mar 12, 2025 09:34 IST
రాజమండ్రిలో లొంగిపోయిన బోరుగడ్డ..
రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. నిన్న సాయంత్రం అతని మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైలులో నేరుగా లొంగిపోయాడు. టీడీపీని దూషించిన కేసులో ఇతను నిందితుడుగా ఉన్నాడు.
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mar 12, 2025 09:32 IST
హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
పాకిస్తాన్ లో హైజాక్ అయిన ట్రైన్ పై భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 104 మందిని రక్షించారని తెలుస్తోంది. దాంతో పాటూ 16 మంది మిలిటెంట్లను చనిపోయినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
అన్నమయ్య జిల్లాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా..ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Mar 12, 2025 09:31 IST
అమిత్ షా కొడుకునంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు.. నలుగురు అరెస్ట్