/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
Gun
చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని లక్ష్మి సినిమా హాల్ సమీపంలో ఓ ఇంట్లో దూరారు. దొంగలు ఇంటి వారిని తుపాకులతో బెదిరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
దీంతో పోలీసులు ఇంటిని రౌండ్ చేసి లొంగిపోవాలని దొంగలను ఆదేశించారు. ఆ ఇంటి పక్కనే బ్యాంకు ఉండటంతో దాని దోపిడీకి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.మొత్తం పది మంది దొంగలు రివాల్వర్లతో చొరబడి ఇంట్లో సభ్యులను లొంగదీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పది మంది దొంగల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ముఠా అన్నది ఇంకా తేలలేదు. అయితే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
స్పెషల్ టీమ్స్ రంగంలోకి...
చిత్తూరులో దోపిడీ దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఏపీ ప్రభుత్వం చిత్తూరుకు అక్టోపస్ బలగాలను పంపించింది. తిరుమల ఆక్టోపస్ యూనిట్ నుంచి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మంగళగిరి నుంచి మరో బృందం ఘటనాస్థలానికి ఆక్టోపస్ టీమ్ చేరుకుంది.
పోలీసులు అదుపులో ఇప్పటికే ఐదుగురు దుండగులు.మరో ఇద్దరు దండగుల కోసం అధికారులు సెర్చింగ్ మొదలు పెట్టారు. పోలీసులు దుండగుల వాహనం నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాడిన వాహనం తమిళనాడు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. డమ్మీ తుపాకులతో ఇంటి యజమానిని దొంగలు బెదిరించినట్లు సమాచారం.