/rtv/media/media_files/2024/11/18/G8TQeyXG3HKJemBF7JFl.jpg)
టీడీపీ నేతలను విమర్శించిన, తిట్టిన కేసులో బోరుగడ్డ అనిల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో తల్లికి ఒంట్లో బాలేదనే కారణంతో రీసెంట్ గా బెయిల్ పొందాడు. అయితే అనిల్ దీని కోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించాడని పోలీసులు నిర్ధారించారు. కానీ మళ్ళీ ఈ నెల 1న బోరుగడ్డ ఈ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు.
అయితే బోరుగడ్డ అనిల్ ఫేక్ సర్టిఫికేట్లతో బెయిల్ తీసుకున్నాడని నిరూపణ అవడంతో ఏపీ హైకోర్టు అతనికి షాక్ ఇచ్చింది. అతని మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. ఇక పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. ఇంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న అంటే నిన్న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి నిన్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బోరుగడ్డ అనిల్ ఈరోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయాడు.
జగన్‌కు అనుచరుడు..
గుంటూరు నగరానికి చెందిన బోరుగడ్డ అనిల్ కేంద్రమంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలే అనచరుడని చెప్పుకునేవాడు. అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అంటూ చలామణి అయ్యాడు. జగన్‌కు మద్దతుగా ఉంటూ తాను పులివెందులకు చెందినవాడినే అంటూ చెప్పుకొనేవాడు. జగన్‌కు అనుకూలంగా ఉంటూ విపక్ష పార్టీలు, నేతలపై సోషల్ మీడియాలో, టీవీ డిబేట్‌లలో ఇష్టమచ్చినట్లు దూషించేవాడు. జగన్‌కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్లపై అసభ్యకరంగా దూషణలు చేస్తుండేవాడు.
దందాలు, దౌర్జన్యాలు..
చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి కూడా గతంలో అనేకసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీళ్లపై చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే విపక్షాలకు చెందిన మహిళల గురించి కూడా అనిల్ అసభ్యంగా మాట్లాడేవాడు. జగన్ పేరు చెప్పుకుంటూ గుంటురు నగరంలో దందాలు, దౌర్జన్యాలు కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీని చూసుకోని ఇష్టరాజ్యాంగా చెలరేగిపోయాడు.
Also Read: Breaking: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ