/rtv/media/media_files/2025/03/12/4iGr6sIOSO5UB9SECAC9.jpg)
మధ్యప్రదేశ్ లో పోలీసులు రెచ్చిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రచ్చ చేశారంటూ పలువురు యువకులకు పోలీసులు గుండ్లు కొట్టించారు. ఈ ఘటన దెవాస్ లో చోటుచేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొంటూ వారికి గుండ్లు కొట్టించి ర్యాలీ తీయించారు. కొంతమంది యువకులు వేడుకల సమయంలో సిటీ కొత్వాలితో దురుసుగా ప్రవర్తించారని.. పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.
Also read : మూడో భార్య ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న షోయాబ్ మాలిక్!
Madhya Pradesh Men "Dangerously" Celebrate India Win, Cops Shave Their Heads, Parade Themhttps://t.co/fTMUEt0vx5pic.twitter.com/HVnK3N9mC4
— NDTV (@ndtv) March 11, 2025
కొంతమంది యువకులు పోలీసు వాహనాన్ని వెంబడించి దానిపై రాళ్ళు విసురుతూ కనిపించారని ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా తమ వద్ద ఉందన్నారు. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయని వెల్లడించారు. పోలీసులు గుండు చేయించి యువకులను తీసుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also read : హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
ఎమ్మెల్యే గాయత్రి రాజే ఫైర్
దీంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజే తీవ్రంగా స్పందించారు. అమాయక యువతను అలా శిక్షించడం సరికాదన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ యువకులు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే విజయాన్ని జరుపుకున్నారు. వారు సాధారణ నేరస్థులు కాదు. వారిని ఇలా బహిరంగంగా ఊరేగించడం పూర్తిగా అన్యాయం. వారి కుటుంబ సభ్యులు నాతో పాటు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
Also read : ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!