Kurnool Bus Accident: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తామన్నారు.
మృతుల్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము అనే వ్యక్తి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి దీపావళి పండక్కి వచ్చిన రాము తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కన్న కొడుకు ఇక లేడనే వార్త తెలియగానే అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
కర్నూలు జిల్లా చిన్న టేకూరులో బస్సు ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని...తరువాత భారీ ఎత్తున మంటలు వచ్చాయని తెలిపారు.ప్రమాదం జరిగిన చోట పరిస్థితులు చాలా హృదయవిదారకంగా ఉన్నాయని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సు (DD01N9490)గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సుపై ఏకంగా తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులతో పాటూ బైక్ డ్రైవర్ కూడా మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు