Bus Accident: కర్నులూ బస్సు ప్రమాదంలో గుర్తు తెలియని మృతదేహం..వివరాల కోసం ప్రకటన

ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన వ్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అందరినీ కలిచి వేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి వివరాలు తెలిశాయి. అయితే ఇందులో ఒక మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోయారు. దీని కోసం ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. 

New Update
siri

collector dr. A. Siri

కర్రూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానకి గురైంది.  హైదరాబాద్ నుంచి బెంగళూరు కు వస్తుండగా బైకొని ఢీకొట్టింది.దీంతో బస్సులో మంటలు చెలరేగి..బస్సంతా తగులబడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇందులో ఇప్పటికే 18 మందిని గుర్తుపట్టారు. ఒక వ్యక్తి గురించి మాత్రం తెలియలేదు. ఇతని వివరాలను తెలపాలంటూ కర్నలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి ప్రకటన జారీ చేశారు.

పేరు తెలియని హైదరాబాద్ వ్యక్తి

హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలోని అతను బస్సు ఎక్కినట్లు తెలిసిందని...వివరాలు తెలిస్తే కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08518 277305కి ఫోన్‌ చేసి చెప్పాలని కోరారు. మరోక గుర్తు తెలియని వ్యక్తి పేరు బస్సు ప్రయాణికుల జాబితాలో లభ్యం కాలేదని చెప్పారు. వయసు 50 ఏళ్ళ వరకు ఉండొచ్చని..మృతదేహం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉందని తెలిపారు. 

మరోవైపు బస్సు డ్రైవర‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చెప్పిన వివరాలను విని షాకయ్యారు. బస్సు ప్రమాదం జరిగిన చోటుకు రాకముందుకే బైక్ యాక్సిడెంట్ జరిగిందని బస్సు నడిపిన వ్యక్తి చెబుతున్నారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో బస్సు స్పాట్‌కి రాకముందే బైక్ ప్రమాదం జరిగిందన్న పోలీసులు నిర్థారించుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీ కొట్టడం వల్లే.. బస్సులో మంటలు చెలరేగినట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల అదుపులో డ్రైవర్, కో-డ్రైవర్లు ఉన్నారు. ఈ  కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బైక్‌ను లాక్కెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ పోలీసులకు చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు