Kurnool Bus Accident: బస్సు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రేవంత్ సర్కార్

కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తామన్నారు.

New Update
Telangana Kurnool Bus Accident

కర్నూల్ బస్సు ప్రమాదం(Kurnool Bus Accident) లో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తామన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సైతం కర్నూలు రోడ్డు ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం తరఫున చనిపోయిన వారికి రూ.2 లక్షలు,  క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Also Read :  అందుకే ప్రమాదం జరిగింది.. ట్రావెల్స్ యాజమాన్యం కీలక ప్రకటన!

CM Revanth Announced Ex Gratia To Victims

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరి ట్రావెల్స్ బస్సు ఈ రోజు ఉదయం 3.30 గంటలకు కర్నూల్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన పల్సర్ బస్సును ఢీకొట్టిన బస్సు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగాయి. ఇవి ఆయిల్ ట్యాంక్ కు అంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. బస్సులో మొత్తం 43 మంది ఉండగా.. 20 మంది సజీవదహనం అయ్యారు. 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏపీ ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి ప్రమాద స్థలం వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read :  శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి

Advertisment
తాజా కథనాలు