/rtv/media/media_files/2025/10/24/kurnool-bus-accident-2025-10-24-18-23-12.jpg)
kurnool bus accident
కర్నూల్ జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిబూడిదైపోయారు. ఎన్నో సంతోషాలు, కలలు, ఆశలతో మొదలైన వీరి ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి- కుమార్తె ఇద్దరూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మెదక్ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి ఆమె కూతురు చందన మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సంధ్యారాణి - వేణు దంపతులకు ఒక కుమార్తె చందన, కుమారుడు వల్లబ్ ఉన్నారు. చందన బెంగళూరులో జాబ్ చేస్తుండగా.. కుమారుడు వల్లబ్ అలహాబాద్ చదువుకుంటున్నాడు. వేణు- సంధ్యారాణి దంపతులు హైదరాబాద్ లో స్థిరపడి.. ప్రస్తుతం దుబాయిలో ఉంటున్నారు.
తల్లీ, కూతురు మృతి
అయితే దీపావళి పండగ కోసం సంధ్యారాణి కుటుంబం పిల్లతో కలిసి హైదరాబాద్ వచ్చింది. పండగ పూర్తయిన తర్వాత భర్త వేణు దుబాయ్ వెళ్లిపోగా.. కొడుకు వల్లబ్ అలహాబాద్ వెళ్ళాడు. ఇక సంధ్యారాణి నిన్న కూతురిని బెంగళూరులో దింపి అక్కడినుంచి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలోనే ఆ తల్లీకూతుళ్లను మృత్యువు కబళించింది. నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో బయలుదేరగా.. ఈరోజు తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వచ్చిన బైక్ బస్సును ఢీకొని.. దాని కిందకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు కింద మంటలు చెలరేగి.. బస్సు కాలి బూడిదైంది.
Follow Us