/rtv/media/media_files/2025/10/24/karnool-bus-2025-10-24-05-46-13.jpg)
గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టాయి. దాంతో పాటూ బస్సులో ఉన్న మొబైల్ ఫోన్లలోని బ్యాటరీలు పేలి మంటలు తొందరగా వ్యాపించాయి. దట్టమైన పొగ. తప్పించుకోవడానికి అన్ని డోర్లు ఓపెన్ అవ్వలేదు. ఇన్ని కారణాలతో కావేరి బస్సులోని ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. స్లీపర్ బెర్తుల మధ్య మాంసపు ముద్దల్లా మిగిలారు. పైగా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు కూడా. బెర్తుల మధ్య శవాలను తీయడానికి కూడా వీలు లేకుండా పోయింది. లాగితే ఎక్కడిక్కడ శరీర భాగాలు విడిపోతూ పరిస్థితి హృదయవిదారకంగా ఉంది.
తల్లీ, బిడ్డ హత్తుకుని..
ఒక ప్రయాణికుడు బస్సు కిటికీకి సగం అటూ సగం ఇటూ ఉన్న పరిస్థితిలో చనిపోయారు. తప్పించు కుందామని కిటీకీ నుంచి దూకే ప్రయత్నంలో సగంలో ఉండగా స్పృహ కోల్పోయారు. దాంతో అక్కడే అలాగే ఉన్న పరిస్థితిలో మొత్తం కాలిపోయారు. మరో ప్రయాణికుల కుటుంబం మొత్తం అంతా మంటలకు ఆహుతి అయ్యారు. గోళ్ళ రమేష్ అతని భార్య అనూష ఇద్దరు పిల్లలు మొత్తం బూడిదగా మిగిలారు. మంటల నుంచి తన కూతురిని కాపాడాలనే ఉద్దేశంతో అనూష ఆమెను హత్తుకుని గట్టిగా పట్టుకున్నారు. అప్పర్ బెర్త్ నుంచి కిందకు దిగే లోపు మంటలు ఉధృత రూపం దాల్చాయి. దీంతో అనూష, ఆమె కూతురు మాన్విత ఒకరినొకరు హత్తుకుని అలాగే మంటల్లో కాలిపోయారు. వీరిని చూసిన పోలీసులు, ఫోర్సెనిక్ బృందాల వారు కూడా తట్టుకోలేకపోయారు. చాలా మంది కంటతడి పెట్టుకున్నారు.
బస్సు అడుగున..
మరో మృత దేహం బస్సు అడుగున డెక్‌లో కనిపించింది. లగేజ్ తప్ప అక్కడ ప్రయాణికులు ఉండరు. అలాంటి చోట మృతదేహం ఎలా వచ్చందనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉండిపోయింది. ఇరువైపులా ఉండే బెర్తుల మధ్య ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఉండే ఇరుకైన మార్గంలోనే పలువురి మృతదేహాలు పడి ఉన్నాయి. దట్టమైన పొగ కారణంగా అటూ ఇటూ కదలడానికి కూడా లేకపోయింది. ఎక్కడి వారు అక్కడే స్పృహ కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
జీవితాంతం వెంటాడుతుంది..
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డవారు ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతున్నారు. ప్రమాదం సమయంలో పరిస్థితి ఎలా ఉంది, తాము ఎలా బయట పడ్డామనే వివరాలను తెలియజేస్తున్నారు. చాలా మంది కిటీకీల్లో నుంచి బయటకు దూకేశారు. ఋ క్రమంలో కాళ్ళకు, తలలకు దెబ్బలు తగిలించుకున్నారు. చాలా మంది నిద్రలో ఉండడం వల్లన చనిపోయారని చెబుతున్నారు. జరిగిన సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద విషయాన్ని డ్రైవర్ వెంటనే చెప్పి ఉంటే ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం సంఘటన తమను జీవితాంత వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bus Accident: వందల ఫోన్లు పేలి..మంటలు తీవ్రతరమై..కర్నూలు బస్సు ప్రమాదం ప్రాథమిక నివేదిక
Follow Us