Bus Accident: ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది..తర్వాత కాలిపోయింది..బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి

కర్నూలు జిల్లా చిన్న టేకూరులో బస్సు ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని...తరువాత భారీ ఎత్తున మంటలు వచ్చాయని తెలిపారు.ప్రమాదం జరిగిన చోట పరిస్థితులు చాలా హృదయవిదారకంగా ఉన్నాయని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

New Update
karnool bus

బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Bengaluru-Hyderabad Travels Bus) వేమూరి కావేరి ట్రావెల్స్‌(Vemuri Kaveri Travels)కు సంబంధించినది తెలుస్తోంది. దీనిపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయని ఆర్టీవీ శాఖ చెబుతోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మొత్తం 42 మంది ప్యాసెంజర్లతో ఈ బస్సు ప్రయాణిస్తోంది. ఇందులో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం తెల్లవారు ఝామున 3.30 గంటలకు జరగడంతో బస్సులోని వారందరూ మంచి నిద్రలో ఉన్నారని చెబుతున్నారు. ఈ ఘోర ఘటన ఎలా జరిగిందనేది అందులోనే ప్రయాణిస్తున్న ఆకాశ్ అనే వ్యక్తి వివరించారు. ఈన ప్రమాదం(Kurnool Bus Accident) నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తాను దీపావళికి హైదరాబాద్‌ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు కోసం బస్సు ఎక్కినట్లు చెప్పారు. బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు అందరూ హఠాత్తుగా లేచి చూశారని...అయితే అప్పటికే బస్సుకు మంటలు అంటుకున్నాయని తెలిపారు. అవి చాలా తొందరగా అంతా వ్యాపించాయని చెప్పారు. తాను బస్సు అద్దం పగులకొట్టి బయటకు దూకేశానని వివరించారు. నాతో పాటూ మరో ఇద్దరు కూడా బస్సులో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారని ఆకాశ్ తెలిపారు.

Also Read :  శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె విలపించేలా రోదిస్తున్న తల్లి

దారుణమైన పరిస్థితులు..

బస్సు ప్రమాదం జరిగిన చోట పరిస్థితి దారుణంగా ఉందని మరో మహిళ తెలిపారు. తాను అదే రోడ్డులో ప్రయాణిస్తున్నానని..తమ కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందని చెప్పారు. ఎందుకా అని దిగి చూస్తే మంటల్లో కాలిపోతూ బస్సు కనిపించిందని ఆమె తెలిపారు. పరిస్థితి గమనించి వెంటనే తాను కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశానని...వారు కొద్దిసేపటిలోనే వచ్చి సహాయ చర్యలు చేపట్టారని తెలిపారు. చాలా మంది బస్సులోనే ఉండిపోయారని..మంటలకు ఆహుతి అయిపోయారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. సీట్లకు అతుక్కుపోయిన మృతదేహాలు, కాలిపోయిన ర్మం, ఎముకలతో పరిస్థితి చాలా భీభత్సంగా ఉందని...తాను చూసి తట్టుకోలేకపోయానని ఆమె వివరించారు. 

మరోవైపు ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందినట్లుగా బంధువులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన చెందిన గోళ్ల రమేశ్‌ (35), అనూష(30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనం అయ్యారు. బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికి తీశామని కలెక్టర్ సిరి తెలిపారు. 

ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని, ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఏపీ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read :  ప్రమాదానికి గురైన కావేరి బస్సుపై 16 చలాన్లు.. రూ.23 వేల ఫైన్

Advertisment
తాజా కథనాలు