/rtv/media/media_files/2025/10/24/sangareddy-2025-10-24-10-37-10.jpg)
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం(kurnool bus fire accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున 3:00 నుండి 3:30 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు.
Also Read : కర్నూలు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందినట్లుగా బంధువులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన చెందిన గోళ్ల రమేశ్ (35), అనూష(30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనం అయ్యారు. గోళ్ళ రమేష్ బెంగళూరులో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు 15 సంవత్సరాల నుండి కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ తరఫున మంచిగా సేల్స్ చేసిన వారికి ఫ్యామిలీ ట్రిప్ రావడంతో వీరు హైదరాబాద్ కు ట్రిప్పుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇక మృతుల్లో సంగారెడ్డి(sangareddy) జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతడి తల్లి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి దీపావళి పండక్కి వచ్చిన వీరిద్దరూ తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
Follow Us