/rtv/media/media_files/2025/10/24/kurnool-bus-accident-2025-10-24-12-54-38.jpg)
Kurnool bus accident
Kurnool Bus Accident: ఆమె పేరు అనూష(Anusha).. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది. దీపావళి పండగ కోసం సొంతూరుకు వచ్చిన అనూష.. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి మళ్ళీ బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది. కానీ, ఇదే ఆమె చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన కావేరి బస్సు ట్రావెల్స్ ప్రమాదంలో అనూష సజీవ దహనమైంది. అనూష మరణం ఆమె కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. చేతికందిన కూతురు ఇక లేదని తెలియడంతో ఆ కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూష రెడ్డి మృతి
— TNews Telugu (@TNewsTelugu) October 24, 2025
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష
దీపావళి పండుగకి ఊరికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో రాత్రి ఖైరతాబాద్ లో కావేరి ట్రావెల్స్ కి చెందిన… pic.twitter.com/LV89OvEu0N
Also Read : అందుకే ప్రమాదం జరిగింది.. ట్రావేల్స్ యాజమాన్యం కీలక ప్రకటన!
అయ్యో అనూష.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భవనగిరి జిల్లాకు చెందిన అనూష రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే దీపావళి పండగ కోసమని తన సొంతూరుకు వచ్చింది. పండగ తర్వాత తిరిగి బెంగళూరు వెళ్తుండగా బస్సు ప్రమాదంలో కాలి బూడిదైపోయింది. అనూష స్వస్తలం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుగా గుర్తించారు. అనూష మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరో యువతి
అనూషతో పాటు మరో సాఫ్ట్ వేర్ యువతి కూడా ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ధాత్రి హైదరాబాద్ లోని తన మేనమామ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. మృతి చెందింది.
బస్సు ప్రమాదం ఎలా జరిగింది?
నిన్న 9 గంటల ప్రాంతంలో కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుమారు 30 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరగా.. ఈరోజు తెల్లవారుజామున కర్నూల్ శివారులోని చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన బైక్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు .. దానిని సుమారు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో మంటలు చెలరేగి బస్ పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం ఎంతో మందిని కలచివేసింది
Also Read: Bus Accident : శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి- VIDEO
Follow Us