Bus Accident: వందల ఫోన్లు పేలి..మంటలు తీవ్రతరమై..కర్నూలు బస్సు ప్రమాదం ప్రాథమిక నివేదిక

కర్నూలు శివార్లలోని చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు. 

New Update
bus accident

కర్నూలు బస్సు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టానికి దారి తీసింది. 20 మంది ప్రయాణికులు చనిపోయారు. బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. మొదట బస్సు బైక్‌ను ఢీకొట్టింది. అప్పుడే ఆయిల్ ట్యాంక్ మూత ఊడి..పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బైక్ బస్సు కింద చిక్కుకుని కొంత దూరం పాటూ లాక్కుని వెళ్ళింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగాయి. వాటికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభం అయ్యాయి. అవి లగేజ్ ప్లేస్ వరకు వ్యాపించాయి. అక్కడ 400 వందలకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ల పార్సిల్ ఉంది. వాటికి మంటలు అంటుకుని, బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు ఎక్కువ అయ్యాయి. అవి ప్రయాణికుల కంపార్టెమెంట్‌ వరకు వ్యాపించాయి. వాళ్ళకు తప్పించుకునే సమయం లేకుండా అయిపోయింది. దానికి తోడు బస్సు మెయిన్ డోర్ తెరుచుకోలేదు. అద్దాలు పగులకొట్టుకుని కొంతమంది తప్పించుకున్నారు. కానీ కొంత మంది మాత్రం మంటలకు ఆహుతి అయిపోయారు. బస్సుకు ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువగా మరణించారు. 

పెద్ద శబ్దంతో పేలుడు..

బస్సులో ఉన్న మెబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లనే పెద్ద శబ్దం కూడా వచ్చిందని ఫోర్సెనిక్ బృందాలు గుర్తించాయి. బస్సులోల ప్రయాణికుల లగేజీ తప్ప మిగతావి ఏమీ క్యారీ చేయకూడదు. దానికి అనుమతి ఉండదు. కానీ బస్సుల యాజమాన్యాలు ఈ విషయాలేవీ పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల వాహనాలను సరుకుల రవాణా కోసం వాడేస్తున్నారు. అన్ని రకాల వస్తువులను బస్సుల్లో అనుమతిస్తున్నారు. కావేరీ బస్సులో కూడా ఇదే జరిగింది. మొబైల్ ఫోన్లు లేకపోయి ఉంటే మంటలు తీవ్రతరం అయి ఉండేవి కాదు. కనీసం ప్రయాణికులు తప్పించుకునే వీలు అయినా ఉండేవి. సాధారణంగా మొబైల్‌ ఫోన్ల పై భాగాన్ని ప్లాస్టిక్‌తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్‌ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇవన్నీ తెలిసి కూడా ఫోన్లను బస్సులో తరలించడానికి ఒప్పుకోవడమే ప్రమాదానికి కారణం అయింది. 

Also Read: New York: న్యూ యార్క్‌లో రెండిళ్ళను తగులబెట్టిన దీపావళి బాణాసంచా

Advertisment
తాజా కథనాలు