కడపలో తప్పిన పెనుప్రమాదం.. అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కాలేజీ బస్సు..
కడప జిల్లా జంగంపల్లె వద్ద ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన డ్రైవర్, విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.